చెన్నై: రాజకీయ రంగప్రవేశంపై తమిళ స్టార్ సినీ హీరో రజినీ కాంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి రాజకీయాలు వద్దులే అంటూ తన అభిమాన సంఘాలకు చెప్పే ప్రయత్నం చేశారు. రజనీకాంత్ రాజకీయ రంగప్రవేశం చేస్తారని తన అభిమాన సంఘాలు ఇవాళ ఉదయం పది గంటలకు సమావేశ మందిరానికి వచ్చి ఎదురు చూశారు.
రజనీ రాగానే స్వయంగా పార్టీ పెట్టాల్సిందేనంటూ.. ఫ్యాన్స్ అంతా గట్టిగా నినాదాలు ఇచ్చారు. అలాగే రజినీ బీజేపీకి సపోర్టు ఇస్తారంటూ వస్తున్న వార్తల పట్ల స్పందించారు. బీజేపీ వ్యతిరేక నినాదాలు చేశారు. రజినీ మరో పార్టీకి మద్దతిస్తామని చెబితే ఏ మాత్రమూ సదరు పార్టీకి తాము మద్దతు ఇవ్వబోమని అభిమాన సంఘ నేతలు పలువురు స్పష్టం చేశారు. సొంత పార్టీ పెడితేనే ఓటేస్తాంమంటూ స్పష్టం చేశారు.