FbTelugu

రాజకీయాలకో దండం: రజినీకాంత్ గుడ్ బై

చెన్నై: మరో కొద్ది నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సమయంలో సూపర్ స్టార్ రజినీకాంత్ చేతులెత్తేశారు. నా ఆరోగ్యం సహకరించడం లేదని, మన్నించాలని అభిమానులు, తమిళనాడు ప్రజలకు ఆయన బహిరంగ లేఖ రాశారు.

రాజకీయాల్లో ప్రవేశం పై రజినీకాంత్ సంచలన నిర్ణయం ప్రకటించారు. మూడు పేజీల సుధీర్ఘ లేఖను ట్విటర్ వేదికగా విడుదల చేశారు. రాజకీయాలకు ఇక నుంచి దూరంగా ఉంటానని, ఎప్పటికలాగే ప్రజలకు స్వచ్ఛంద సేవ చేస్తానన్నారు. అనారోగ్యం, కుటుంబ సభ్యుల సూచనతో వెనక్కి తగ్గినట్లు తెలిపారు. హైదరాబాద్ లో అన్నాత్తే షూటింగ్ లో హై బీపీతో అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే జూబ్లిహిల్స్ లోని అపోలో హస్పిటల్ కు తరలించి చికిత్స చేశారు. కరోనా పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని తేలడంతో కుటుంబ సభ్యులు, అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.

రాజకీయ ప్రవేశ ప్రకటన తరువాత తను ఆసుపత్రిలో చేరడం దేవుడి హెచ్చరికగా భావిస్తున్నట్లు రజినీకాంత్ తెలిపారు. అనారోగ్యంతో ప్రజలను కలవడం కష్టంగా ఉంటుందని, ప్రచారం కూడా చేయడం భారంగా ఉంటుందన్నారు. ఈ ప్రకటన తమిళనాడులో అభిమానులు, ప్రజలను నిరాశకు గురి చేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.