FbTelugu

రజినీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

న్యూఢిల్లీ: సూపర్ స్టార్ రజినీకాంత్ ను దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కు ఎంపిక చేసినట్లు కేంద్ర సమాచార మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రకటించు. 2020 సంవత్సరానికి గాను ఫాల్కే అవార్డు అందచేస్తున్నామన్నారు.

సూపర్ స్టార్ రజినీకాంత్ 51వ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. సినీరంగంలో విశేష సేవలందించినందుకు గాను రజినీకాంత్ కు విశిష్ట గౌరవం దక్కింది. 2000లో పద్మ భూషణ్, 2016 లో పద్మ విభూషణ్ బిరుదులు వరించాయి. ఫాల్కే అవార్డు ప్రకటనతో తమిళనాడులో రజినీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. అయితే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో అవార్డు ప్రకటించడం దుమారం రేపుతోంది. ఈ నెల 6వ తేదీన పోలింగ్ ఉండగా, కేంద్రం ఈ ప్రకటన చేయడం మస్కా కొట్టడమేనని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేస్తానని చెప్పి ప్రకటించి వెనక్కి తగ్గిన రజినీకాంత్ కు దాదా సాహెబ్ ఫాల్కె అవార్డును బహుమతిగా అందించారని రాజకీయ పార్టీలు మండిపడుతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.