FbTelugu

ఎన్నికల కోసమే కెసిఆర్ వరాలు: ఈటల

హుజూరాబాద్: ఎన్నికలు ఎక్కడ వస్తే అక్కడ వరాలు ప్రకటించే అలవాటు సిఎం కెసిఆర్ కు ఉందని, ఆ తరువాత అమలు సంగతి దేవుడెరుగు అని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

ఇల్లదంకుంటలో ఇవాళ రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ, తను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తరువాత గతంలో ఆగిపోయిన పథకాలన్నీ వస్తాయని ప్రజలు సంతోష పడుతున్నారన్నారు. ఫించన్ల కోసం పలువురు దరఖాస్తు చేసుకున్నా పరిష్కరించకుండా పెండింగ్ లో పెట్టారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగులకు రూ.3వేల భృతి వెంటనే మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కొత్త రేషన్ కార్డుల కోసం రాష్రం వచ్చినప్పటి నుంచి లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారన్నారు. మాజీ ప్రధాని పివి.నరసింహారావు పేరు మీద జిల్లా ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదించానని అన్నారు. హుజురాబాద్ ను జిల్లాగా ప్రకటించడంతో పాటు వావిలాల, చల్లూరును మండలాలు ప్రకటించాలని ఈటల అన్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.