FbTelugu

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా రాజశేఖర్ రెడ్డి ఎన్నిక

అమరావతి: మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.
గత ఎన్నికల్లో చిలకలూరి పేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. ఈ నియోజకవర్గం టిక్కెట్ ను విడదల రజనీకి కేటాయించారు. దీంతో ఆయన గుంటూరు జిల్లా పార్టీ కన్వీనర్ గా కొనసాగుతున్నారు. చిలకలూరి పేట ఎన్నికల ప్రచార సభలో మర్రి రాజశేఖర్ కు మంత్రి పదవి ఇస్తానని సీఎం వైఎస్.జగన్ హామీ ఇచ్చారు.

ఎమ్మెల్సీగా ఎన్నిక చేసినందున అక్కడితోనే సరిపుచ్చుతారా, మంత్రివర్గంలోకి తీసుకుంటారా అనేది పలువురు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

You might also like