FbTelugu

‘ఆర్​ఆర్​ఆర్’ టీజర్​ రిలీజ్​ అప్​డేట్

– ‘బాహుబలి’ సిరీస్​ తర్వాత అతంటి భారీ బడ్జెట్​తో డైరెక్టర్​ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్​ఆర్​ఆర్​’. పాన్​ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్​ చరణ్​, ఎన్టీఆర్​ ప్రధానపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 7న విడుదల చేయనున్నారు. రిలీజ్​ డేట్​ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్​ను ప్రారంభించాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తుంది.  ఈ సందర్భంగా ‘ఆర్​ఆర్​ఆర్’ టీజర్​ రిలీజ్​ అప్​డేట్​ను అక్టోబరు 29న ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇదే విషయమై సోషల్​ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. ‘ఆర్ఆర్​ఆర్​’ సినిమా నుంచి ఇటీవలే రిలీజ్​ అయిన ‘దోస్తీ’ లిరికల్​ సాంగ్​తో పాటు Roar of RRR Making Video ప్రేక్షకుల నుంచి విపరీతమైన క్రేజ్​ లభించింది.
దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్‌తో (RRR Budget) ‘ఆర్ఆర్ఆర్’ నిర్మిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli RRR Movie Budget) తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌ చరణ్‌ (Ram charan RRR New Look), కొమురం భీమ్‌గా ఎన్టీఆర్​ (Ntr RRR Poster) నటిస్తున్నారు. డీవీవీ దానయ్య నిర్మాత. కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఆలియాభట్‌, ఒలీవియా మోరీస్‌, అజయ్‌ దేవ్‌గణ్‌, శ్రియ, తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 7న విడుదల (RRR Release Date) కానుందీ చిత్రం.

 

You might also like

Leave A Reply

Your email address will not be published.