FbTelugu

బిజెపి నేతలు జోకర్లు, బఫూన్లు: టిఆర్ఎస్

హైదరాబాద్: తెలంగాణ బిజెపి నేతలు అనాలోచితంగా జోకర్, బఫూన్ల లాగా మాట్లాడుతున్నారని రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.

తెలంగాణ భవన్ లో పౌరసరఫరాల సంస్థ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డితో కలిసి పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడైనా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నారా.. బిజెపి నేతలు దీనికి సమాధానం చెబుతారా అని ప్రశ్నించారు. సాగు నీటి ప్రాజెక్టుల్లో 1 కోటి 45 లక్షల ఎకరాల్లో ఈ యాసంగిలో సాగు అయ్యిందన్నారు. బిజెపి నేతలు కళ్లుండి కబొదులుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఏ రాష్ట్రం లో కూడా తెలంగాణ స్థాయి లో ధాన్యం సేకరణ చేయటం లేదు.. కరోనా వున్నా రాష్ట్రం లో ధాన్యం కొంటున్నామన్నారు. నలుగురు బిజెపి ఎంపీ లకు దమ్ముంటే ఒక్క మెడికల్ కాలేజీ అయినా మంజూరు చేయించాలన్నారు. ఒక్క ప్రాజెక్ట్ కు అయినా జాతీయ హోదా తేవాలన్నారు. మేము కొత్తగా చాలా జిల్లాలో మెడికల్ కాలేజీ పెడుతున్నామన్నారు.

కరోనా విషయంలో ఏ రాష్ట్ర సిఎం చేయనట్లు ఇక్కడ కెసిఆర్ ఆస్పత్రులకు వెళ్లి అందరికి ధైర్యం చెప్పారు. అధికారులతో పొద్దనక, రాత్రనక అనేక సమీక్షలు చేసి ఆక్సిజన్ తో సహా అన్ని అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారని రాజేశ్వర్ రెడ్డి అన్నారు. మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లుతూ, ధ్యానం కొనుగోలుకు 7 వేల కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయాలని సిఎం కెసిఆర్ చెప్పారు. పెద్ద మొత్తంలో ధాన్యం కొనుగోలు చేస్తున్నామన్నారు. ఇప్పటికీ 72 శాతం ధాన్యం కొనుగోలు చేశామని, అనగా 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం అన్నారు. ఇతర రాష్ట్రాలు రైతుల వద్ద ధాన్యం కొనుగోళ్లు చేయటం లేదన్నారు. కరోనా సమయంలో ధాన్యం కొంటున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.