అమరాతి: ఏపీ ప్రభుత్వం పలు రేషన్ వస్తువుల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ప్రభుత్వం తెల్లరేషన్ కార్డు గల పేదలకు సబ్సిడీపై అందించే కందిపప్పు, చెక్కెర ధరను పెంచింది.
ఇప్పటివరకు రేషన్ పై అందిస్తున్న 1/2 కేజీ(అరకేజీ) చెక్కెర ధర రూ.10 నుంచి రూ.17 కు పెంచారు. కందిపప్పు కేజీ రూ.40 నుంచి రూ.67 కు పెంచారు. అయితే అంత్యోదయ అన్న యోజన కార్డుదారులకు మాత్రం చక్కెర ధరలు యధాతథంగా ఉండనున్నాయి.