FbTelugu

 ట్విటర్ లో దుమ్ము లేపారు…

న్యూఢిల్లీ: ఈ సంవత్సరంలో సుమారు పది మంది ప్రముఖులు ట్విటర్ లో టాప్ టెన్ ట్వీట్ల జాబితాలో దుమ్ము లేపారు. ఈ ఏడాది ట్విటర్ వేదిక అత్యధికంగా చర్చనీయాంశమైన వ్యక్తులు, అంశాలకు సంబంధించిన వివరాలను ఆ సంస్థ ప్రకటించింది.

పలు అంశాలపై జవాబుదారితనాన్ని డిమాండ్ చేసేందుకు ఈ వేదికను ఉపయోగించుకున్నారని ట్విటర్ వెల్లడించింది. అమెరికా ఎన్నికలు, జార్జి ఫ్లాయిడ్ హత్య, తదితర అంశాలపై 700 మిలియన్లకు పైగా ట్వీట్లు చేశారు. అత్యధిక ట్వీట్లు చేసిన వారిలో టాప్ టెన్ జాబితాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉండగా తరువాతి స్థానంలో నూతనంగా ఎన్నికైన జోసెఫ్ ఆర్.బైడెన్ ఉన్నారు. అమెరికాలో శ్వేతజాతి పోలీసుల చేతిలో దారుణంగా చనిపోయిన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ మూడో స్థానంలో నిలిచాడు.
నాలుగో స్థానంలో అమెరికా బాస్కెట్ బాల్ క్రీడాకారుడు కోబె బ్రైంట్, ఐదు లో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉన్నారు. ఏడో స్థానంలో ఇండియా ప్రధాని నరేంద్ర మోదీ, పదో స్థానంలో ఇటీవల ఎన్నికైన అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారీస్ ఉన్నారు. తమిళ హీరో విజయ్ తన అభిమానులతో తీసుకున్న సెల్ఫీ 1,45,000 కన్నా ఎక్కువసార్లు రీ ట్వీట్ అయింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.