FbTelugu

నైరుతి రుతుపవనాలతో వర్షాలు

అమరావతి: రాష్ట్రంలో వచ్చే 48 గంటల్లో నైరుతి రుతుపవనాల ప్రభావంతో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

24 గంటల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో ప్రవేశిస్తాయని తెలిపారు.  22న ఉత్తర అండమాన్‌ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొన్నారు. 24వ తేదీన ఇది మరింత బలపడి తుపానుగా మారవచ్చని అంచనా వేశారు. దీని ప్రభావంతో ఏపీలో రానున్న రెండు రోజుల్లో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో ఉరుములు మెరుపులతో పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.