FbTelugu

తెలంగాణలో మరో రెండ్రోజులు వర్షాలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే దేశమంతా వ్యాపించాయి.

ఈ ఏడాది నైరుతి రుతుపవనాల ప్రభావంతో గతేడాదితో పోలిస్తే ఎక్కువ వర్షపాతం నమోదౌతుందని తెలిపింది. ఏపీలోనూ పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రానున్న మూడు రోజుల పాటూ.. తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది.

You might also like