FbTelugu

హైదరాబాద్‌ లో వానలు

హైదరాబాద్‌: నగర వ్యాప్తంగా బుధవారం తెల్లవారుజాము నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిశాయి. మండుతున్న ఎండాకాలంలో వర్షాలు పడడంతో ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది.

బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, మియాపూర్‌, చందానగర్‌, గచ్చిబౌలి, మాదాపూర్‌, హయత్‌నగర్‌, వనస్థలిపురం, ఎల్.బి.నగర్‌, ఉప్పల్‌, దిల్‌సుఖ్‌నగర్‌, కోఠి, కుత్బుల్లాపూర్‌, బాలానగర్‌, బోరబండ, రహమత్‌నగర్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, నాంపల్లిలో ఉదయం నుంచి ఆగకుండా రెండు గంటల పాటు వర్షం కురిసింది. ఎల్.బి. నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌ పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షపాతం నమోదుకావడంతో మున్సిపల్‌, ఎన్డిఆర్‌ఎఫ్‌ సిబ్బందిని జిహెచ్‌ఎంసి అప్రమత్తం చేసింది. తెల్లవారుజాము నుంచి వాన కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
వాతా‌వ‌ర‌ణంలో మార్పుల కార‌ణంగా వర్షాలు కురిశాయమని వాతావారణ నిపుణులు తెలిపారు. రాష్ట్రం‌లోని పలు ప్రాంతాల్లో ఉరు‌ములు, మెరు‌పులు, ఈదు‌రు‌గా‌లు‌లతో కూడిన వర్షాలు కురు‌స్తు‌న్నాయన్నారు. ఒడిశా పరి‌సర ప్రాంతాల్లో ఉన్న ఉప‌రి‌తల ఆవ‌ర్తనం మంగ‌ళ‌వారం బల‌హీ‌న‌ప‌డింది. మరా‌ఠ్వాడ నుంచి ఉత్తర ఇంటీ‌రి‌యర్‌ కర్ణా‌టక వరకు గాలి విచ్ఛి‌న్నతి ఏర్పడింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.