FbTelugu

మరో రెండ్రోజుల పాటూ వర్షాలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో రానున్న మరో రెండ్రోజులు వర్షాలు పడనున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ భారత ద్వీపకల్పంపై ఉపరితల ద్రోణి ప్రభావం ఆవరించి ఉన్నట్టు తెలిపింది.

ఈ ఉపరితల ద్రోణి ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడనున్నాయని తెలిపింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. గత కొన్ని రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు వంకలు పొంగుతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.