FbTelugu

తెలుగు రాష్ట్రాల్లో మరో 3 రోజులు వర్షాలు

హైదరాబాద్: తెలంగాణలో రానున్న మరో 3 రోజుల పాటూ వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపింది.

వీటి ప్రభావంతో తెలంగాణలో మూడు రోజులు, ఏపీలో మరో 2 రోజులు వర్షాలు పడనున్నాయని తెలిపింది. రాయలసీమలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు తెలిపింది. కోస్తాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది.

You might also like