FbTelugu

నీట మునిగిన ముంబయి

ముంబయి: మహానగరాన్ని వానలు ముంచెత్తుతున్నాయి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో నగరంలో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి.

కరోనా సెకండ్ వేవ్ నుంచి ఇప్పడిప్పుడే కోలుకుంటున్న ముంబయి కి వర్షాల రూపంలో మరో ప్రమాదం ముంచుకువచ్చింది. నగరంలోని హిందూ మాత, సియాన్, ఈస్టర్న్ ఎక్స్ ప్రెస్ హైవే, చెంబూరు ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు, మురికివాడల్లో ప్రజలు ఇళ్లు విడిచి బయటకు రాలేని పరిస్థితి ఉంది. జనజీవనానికి తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం మూలంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాలలో ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వాహనదారులు ముందుకు కదల్లేని స్థితి ఏర్పడింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.