FbTelugu

కోస్తా, రాయలసీమలకు వర్షసూచన

అమరావతి: చురుగ్గా కదులుతున్న నేరుతి రుతుపవనాల ప్రభావంతో నేడు రేపు కోస్తా, రాయలసీమల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

నేడు ఉత్తరాంధ్రలో భారీ వర్షం పడనున్నట్టు తెలిపింది. సముద్ర తీరంలోషియర్ జోన్ ప్రభావంతో వర్షాలు పడతాయని తెలిపింది. వీటికి తోడు ఉత్తర కర్నాటక ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉన్నట్టు తెలిపింది.

You might also like