FbTelugu

మరో మూడు రోజులు వర్షాలు

హైదరాబాద్: రాగల మూడు రోజుల పాటు పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. నేటి నుంచి 23వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

విదర్భ, మరఠ్వాడ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 2.1 కిలో మీటర్ల ఎత్తు మధ్య ఏర్పడిన ఉపరితల ద్రోణి బుధవారం నాడు బలహీనపడింది. తాజాగా ఉత్తర తూర్పు ఉపరితల ఆవర్తం దక్షిణ తమిళనాడు నుంచి ఇంటిరీయర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిందని వాతవారణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో రానున్న మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురవనున్నాయి. తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.