హైదరాబాద్: నేడు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఆగ్నేయ ఉత్తర ప్రదేశ్ నుంచి దక్షిణ ఛత్తీస్ గఢ్ వరకు ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉన్నట్టు తెలిపింది. కోస్తా రాయలసీమ ప్రాంతాలపై నైరుతీ రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని తెలిపింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోనూ మోస్తరు వర్షాలు పడనున్నట్టు తెలిపింది.