FbTelugu

తెలంగాణ ప్రయాణీకులకు క్వారంటైన్: రైల్వే

హైదరాబాద్: తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్లాలనుకునే ప్రయాణీకులు ఇకనుంచి అంత సులువు కాదని దక్షిణ మధ్య రైల్వే (ఎస్.సి.ఆర్) ప్రకటించింది. ఢిల్లీ వెళ్లే ప్రయాణీకులు అక్కడ దిగిన వెంటనే 14 రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది.

రెండు డోసులు వ్యాక్సిన్ వేయించుకున్నవారు కూడా స్టేషన్ కు వెళ్లే సమయానికి 72 గంటల ముందు ఆర్.టి.పి.సి.ఆర్ టెస్టు చేయించుకోవాలన్నారు. నెగెటివ్ వచ్చినవారు కూడా కనీసం వారం రోజులు క్వారంటైన్ లో ఉండాల్సిందేనన్నారు. ఈ నిబంధనలు పరిగణనలోకి తీసుకుని ప్రయాణం చేయాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది. ఏపి, తెలంగాణలో ఎన్.440కె వేరియంట్ వైరస్ విజృంభిస్తున్నదని పరిశోధనా సంస్థలు వెల్లడించడంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. విమానాల్లో వచ్చేవారు కూడా 14 రోజులు క్వారంటైన్ కు వెళ్లాల్సి ఉంటుందని ఏయిర్ ఇండియా ఆదివారం నాడు ప్రకటించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.