FbTelugu

ఇక ఆక్సిజన్ రైళ్లు పరుగులు…

న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. ఆక్సిజన్ ను వేంగంగా రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేసింది.
పలు రాష్ట్రాలు ఆక్సిజన్ కొరతతో సతమతమవుతున్నాయి. సకాలంలో వైరస్ బాధితులకు లభ్యత లేకపోవడం మూలంగా ప్రాణాలు కోల్పోతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆక్సిజన్ దొరక్క ఇవాళ ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇలా పలు రాష్ట్రాలలో చోటు చేసుకుంటుండగా కొన్ని బయటకు వస్తున్నాయి, మరికొన్న సంఘటనలు వెలుగు చూడడం లేదు. డిమాండ్ కు సరిపడా ఆక్సిజన్ లభ్యత కావడం లేదని, ఎయిర్ కార్గో ద్వారా సరఫరా చేయాలని పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ ఒక బృహత్తర కార్యాచరణ అమలు చేస్తున్నది. ఆక్సిజన్ సరఫరా చేసే బాధ్యతను మరింత వేగం చేసింది. ఇక నుంచి తక్కువ సమయంలో రాష్ట్రాలకు చేరవేసేందుకు రైల్వే ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ పేరిట రైళ్లను నడిపించనున్నది. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియుష్ గోయల్ ట్వీట్ చేశారు. వేగంగా పంపించేందుకు వీటి కోసం ప్రత్యేక గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు.

సోమవారం మహారాష్ట్ర నుంచి రైళ్లు బయలుదేరి విశాఖపట్నం, రూర్కేలా, బొకారో, జంషెడ్ పూర్ చేరుకుని, ఆక్సిజన్ నింపుకున్న తరువాత తిరిగి గమ్యస్థానాలకు చేరుకుంటుంది. ఇలా ఏ రాష్ట్రంలో అత్యవసరం ఉంటే ఆ రాష్ట్రాలనికి ఆక్సిజన్ రైళ్లను నడిపించనున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.