FbTelugu

రైల్ నిలయం మూసివేత

హైదరాబాద్: సికింద్రాబాద్ లోని రైల్ నిలయం భవనాన్ని మూసివేశారు. ఈ భవనంలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల్లో 30 మందికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్ లో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. సౌత్ సెంట్రల్ జోన్ కార్యకలాపాలన్నీ సికింద్రాబాద్ రైల్ నిలయం నుంచే కొనసాగిస్తారు. ఇక్కడ వేలాది మంది ఉద్యోగులు పనిచేస్తారు. ఒకేసారి ముప్పై మంది ఉద్యోగులకు కరోనా నిర్థారణ కావడంతో ఉన్నతాధికారులు రెండు రోజుల పాటు భవనం మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.

శానిటైజేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత రైల్ నిలయాన్ని తిరిగి తెరవనున్నారు. అప్పటి వరకు ఎవరూ విధులకు రావోద్దని ఉన్నతాధికారులు ఆదేశించారు.

You might also like