FbTelugu

రాహుల్ ట్వీట్… ట్విట్టర్ లో ట్రెండింగ్

భారత్-చైనా సరిహద్దుల్లో ఇరుదేశాల సైన్యం మధ్య జరిగిన పోరులో భారత సైన్యం అమరులైన విషయం రాజకీయ పార్టీల మధ్య అగ్గి రాజేస్తున్నది.

ఈ దారుణకాండపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శల దాడి అంతకంతకూ పెంచుతున్నారు. సరెండ్ మోదీ అంటూ రెండు పదాల విమర్శను ఆదివారం నాడు రాహుల్ ట్వీట్ చేశారు. సాయంత్రానికల్లా ఇది ట్విట్టర్ లో నెంబర్ వన్ ట్రెండ్ గా మారింది. ఈ ట్వీట్ కు ఆయన జపాన్ టైమ్స్ పత్రిక రాసిన ఓ కథనాన్ని కూడా జోడించారు.

దీనిపై లక్షలాది మంది ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఎవరికి తోచిన విధంగా వారు అర్థాలు చెప్పారు. పలువురు రాహుల్ లేవనెత్తిన రెండు పదాల ప్రశ్నకు కేంద్రం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మరికొందరు రాహుల్ ‘సరెండర్’ అన్న పదాన్ని తప్పుగా స్పెల్ చేశారని సెటైర్లు వేశారు. మరికొందరు రాహుల్ పదాలతో ఆడుతున్నారని, కొత్త పదాలు కనిపెడుతున్నారని కామెంట్లు చేయడం గమనార్హం.

 

You might also like