FbTelugu

సర్ వద్దు… అన్నా అంటే చాలు: రాహుల్

పుదుచ్చేరి: సర్… సర్… అని నన్ను పిలవొద్దు. రాహుల్ అని పిలవండి… ఇష్టం లేకుండా అన్నా అని పిలిస్తే చాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ కోరారు.

రాహుల్ గాంధీ పుదుచ్చేరిలో పర్యటించిన సందర్భంగా ఈ పరిస్థితి ఎదురైంది. తన పర్యటనలో భాగంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా పులువురు విద్యార్థులు ప్రశ్నలు అడిగేందుకు ఉత్సాహం చూపించారు. కొందరు విద్యార్థులు ముందుకు వచ్చి సర్.. సర్ అని సంబోధించారు. వారి మాటలు విన్న ఆయన తనను సర్ అని సంబోధించవద్దని సూచించారు. నన్ను రాహుల్ అనండి లేదంటే అన్నా అని పిలవండి చాలు అని కోరారు. మీ కాలేజీ లెక్చరర్ లేదా ప్రిన్సిపాల్ ను మాత్రం సర్ అని పిలవాలని చమత్కరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.