FbTelugu

నిరభ్యంతరంగా వెళ్లిపోచవచ్చు: రాహుల్

ఢిల్లీ: కాంగ్రెస్ ను వీడాలనుకునే వారు నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు అని ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ పార్టీని వీడిన నేపథ్యంలో రాహుల్ ఆయనను ఉద్దేశించి ట్వీట్ చేశారు.

కొత్తవారికి కాంగ్రెస్ ద్వారాలు ఎప్పుడు తెరిచే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. అయితే తన అనుచరవర్గ ఎమ్మెల్యేలతో సచిన్ పైలట్ హర్యానాలోని ఒక హోటల్ లో భేటీ అయి సమాలోచనలు చేస్తున్నారు. తను బీజేపీ లో చేరడం లేదని, కాంగ్రెస్ లోనే ఉంటానని ఇవాళ ఉదయం ప్రకటించిన విషయం తెలిసిందే.

You might also like