FbTelugu

రాహుల్ గాంధీ రీ ఎంట్రీ

ఢిల్లీ: రాహుల్ గాంధీ మళ్లీ పార్టీ పగ్గాలు చేపట్టబోతున్నాడా అంటే? అవుననే విధంగా సంకేతాలు వినవస్తున్నాయి. ఎఐసీసీ సమావేశం త్వరలో ఏర్పాటు చేయబోతున్నట్లు మధుసుదన్ మిస్త్రీ ప్రకటించారు.
పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు డిసెంబర్ లేదా జనవరిలో జాతీయ స్థాయి సమావేశం నిర్వహించాలని పార్టీ భావిస్తోందని ఆయన తెలిపారు. వేదిక తేదీలు ఖరారు కాగానే మీకు సమాచారం పంపిస్తామని అన్ని రాష్ట్రాల పార్టీ శాఖలకు మధుసూదన్ లేఖలు పపించారు. రాహుల్ నేతృత్వంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయం పాలుకావడంతో ఆయన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి సోనియా గాంధీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగుతున్నారు.

సీనియర్ల విమర్శలు, పార్టీ పరిస్థితి దారుణంగా దెబ్బతినడంతో రాహుల్ గాంధీ మళ్లీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించే అవకాశాలు కన్పిస్తున్నాయి. పార్టీ పనితీరుపై 23 మంది సీనియర్లు లేఖాస్త్రాలు సంధించారు. మొన్న కపిల్ సిబాల్, నిన్న గులాం నబీ ఆజాద్ లు పార్టీపై తిరుగుబాటు చేసే విధంగా విమర్శలు గుప్పించారు. పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడు అవసరం చెబుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.