FbTelugu

కరోనాపై పోరులో మోదీ చేతులెత్తేశారు: రాహాల్

న్యూఢిల్లీ: దేశంలో రోజురోజుకి తీవ్రంగా వ్యాపిస్తున్న కరోనాపై పోరాడకుండా ప్రధాని మోదీ చేతులెత్తేశారని కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా పలు విమర్శలు చేశారు.

మోదీ మౌనంగా ఉంటూ కరోనాకు లొంగిపోయారని అన్నారు. దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నా.. నివారణ చర్యలు తీసుకోవడంతో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. జూన్ 9 తర్వాత కరోనా నివారణపై మోదీ ప్రభుత్వం ఎలాంటి ప్రధాన చర్చలు జరుపలేదంటూ వచ్చిన ఓ కథనాన్ని ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు గుప్పించారు.

You might also like