FbTelugu

అనాథాశ్రమంలో ర్యాగింగ్

కృష్ణా: గన్నవరం మండలంలోని బుద్ధవరం కేర్ అండ్ షేర్ అనాథాశ్రమంలో చోటు చేసుకున్న ర్యాగింగ్ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న వాసు అనే విద్యార్థిని ర్యాగింగ్ పేరుతో యశ్వంత్ గ్యాంగ్ అర్థనగ్నంగా నిలబెట్టింది.

ఎంత బ్రతిమిలాడినా విద్యార్థిని గ్యాంగ్ వదలకుండా దాడి చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను యశ్వంత్ గ్యాంగ్ సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. తనను ర్యాగింగ్ చేయడమే కాకుండా వీడియో తీసి వైరల్ చేయడంతో మనస్తాపం చెందిన విద్యార్థి వాసు స్వగ్రామానికి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.