FbTelugu

ఏపి సిఎస్ కు రఘురామ భార్య ఫోన్.. మారిన సీన్!

హైదరాబాద్: వైసిపి ప్రభుత్వం తన భర్త, ఎంపి కె.రఘురామ కృష్ణమ రాజును చంపేస్తుందన్న భయం ఆయన భార్యను వెంటాడుతునే ఉన్నది. ఏపి సిఐడికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు తీర్పు రావడంతో రఘురామ భార్య వెంటనే అప్రమత్తమైంది.
ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు రఘురామ భార్య రమాదేవి స్వయంగా ఫోన్ చేసింది. తన భర్తకు ఇంకా ప్రాణహానీ తప్పలేదని, సిఐడికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో జైలులోనే అంతమొందించవచ్చని అనుమానం వ్యక్తం చేసింది. వెంటనే ఆయనను జైలు నుంచి సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ కు తరలించాలని ఆమె కోరింది.

అప్పటి వరకు జాప్యం చేద్దామనే ధోరణిలో ఉన్న ప్రభుత్వ వర్గాలు ఆమె ఆందోళనతో హైదరాబాద్ కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు గుంటూరు జిల్లా జైలు వద్దకు ఆయనను తరలించేందుకు ఎస్కార్ట్, వై కేటగిరీ సిబ్బంది చేరుకున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలు జైలు సూపరింటెండెంట్ కు అందచేశారు. ఈరోజు రాత్రి 10 గంటల కల్లా సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ కు రఘురామ ను తరలించనున్నారు. కాసేపట్లో గుంటూరు జైలు నుంచి రఘురామ ఎస్కార్ హైదరాబాద్ బయలుదేరే అవకాశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు జ్యూడిషియల్ ఆఫీసర్ ను తెలంగాణ హైకోర్టు నియమించింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.