FbTelugu

ఏపి సిఐడి కి రఘురామ లీగల్ నోటీసు

అమరావతి: సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన తరువాత వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణమరాజు తనను అకారణంగా హింసించిన వారి పై సంబంధిత శాఖలకు ఫిర్యాదు చేస్తున్నాడు.

ఏపి సిఐడీ అదనపు డిజి సునీల్ కుమార్‌కు రఘురామ లీగల్ నోటీసు పంపారు. తనను హైదరాబాద్ లో అరెస్టు సమయంలో తన వద్ద నుంచి తీసుకున్న వస్తువులను మెజిస్ట్రేట్‌ వద్ద జమ చేయాలని నోటీసు లో స్పష్టం చేశారు. మొబైల్ ఫోన్‌లో విలువైన సమాచారం ఉండడంతో దాని కోడ్ చెప్పాలని హింసించారని రఘురామ అన్నారు. సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ లో తనపై నిఘా పెట్టిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ కు ఇటీవలే ఆయన ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదులో భాగంగానే గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి పై ఏపి ప్రభుత్వం వేటు వేసిందంటున్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టిటిడి అదనపు ఈఓ గా పనిచేస్తున్న ఎవి.ధర్మారెడ్డిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి.

You might also like

Leave A Reply

Your email address will not be published.