FbTelugu

సీల్డ్‌ కవర్‌లో సుప్రీంకు వైద్య పరీక్షల నివేదిక

హైదరాబాద్‌: నరసాపురం వైసిపి ఎంపి కె.రఘురామ కృష్ణమరాజుకు అయిన గాయాలపై సికింద్రాబాద్‌లోని మిలిటరీ హాస్పిటల్ వైద్యపరీక్షలు పూర్తయ్యాయి. తెలంగాణ హైకోర్టు నియమించిన జ్యూడిషియల్ అధికారి సమక్షంలో ముగ్గురు వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించింది.

ఈ నివేదికను తెలంగాణ హైకోర్టు సీల్డ్‌ కవర్‌లో సుప్రీంకోర్టుకు మంగళవారం సాయంత్రం పంపింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాజుకు రక్త, చర్మంతో పాటు ఇతరత్రా మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ముగ్గురు వైద్యుల బృందం పరీక్షలు నిర్వహించింది. వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో మిలిటరీ అధికారులు వీడియో తీయించారు. బయటి నుంచి చర్మవ్యాధి నిపుణుడిని రప్పించి పరీక్షించినట్లు తెలిసింది. తెలంగాణ హైకోర్టు జ్యుడీషియల్‌ రిజిస్ట్రార్‌ డి.నాగార్జున రావు ను జ్యూడిషియల్ అదికారిగా నియమించిన విషయం తెలిసిందే. వైద్యాధికారుల నివేదికను రిజిస్ట్రార్‌ హైకోర్టుకు మంగళవారం సాయంత్రం అందజేశారు. డాక్టర్ల నివేదికతోపాటు.. వీడియో ఫుటేజిని సీల్డ్‌ కవర్‌లో సుప్రీంకోర్టుకు మంగళవారం సాయంత్రం తెలంగాణ హైకోర్టు ప్రత్యేక ధూత ద్వారా పంపింది. ఈ నివేదికను సుప్రీంకోర్టు శుక్రవారం పరిశీలించనుంది. సుప్రీంకోర్టు నుంచి తదుపరి ఆదేశాలు వచ్చేవరకూ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న రఘురామకృష్ణరాజుకు ఇక్కడే చికిత్స అందిస్తామని సికింద్రాబాద్‌ మిలిటరీ హాస్పిటల్ వర్గాలు తెలిపాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.