FbTelugu

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి: రాఘవులు

హైదరాబాద్: కరోనా ను ఆరోగ్య శ్రీ లో చేర్చాలని, చికిత్స చేసేందుకు ఆసుపత్రుల సంఖ్యను పెంచి తగిన సిబ్బంది ని నియమించాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ. రాఘవులు డిమాండ్ చేశారు.
ధనిక రాష్ట్రం అంటున్న తెలంగాణ, కేరళ ప్రభుత్వం తరహాలో కరోనాను ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నదని ఆయన ప్రశ్నించారు. గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా టెస్టులు విస్తృతంగా చేపట్టాలని, అప్పుడే రోగుల సంఖ్య తెలుస్తుందన్నారు. ఇప్పటికే లాక్ డౌన్ వల్ల పేదలు ఉపాధి కోల్పోయి అవస్థలు పడుతున్నారన్నారు. దీనికి తోడు కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి నడ్డి విరిచిందన్నారు.

వైరస్ కారణంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోతున్నారని ఆయన అన్నారు. ఆన్ లైన్ విద్య పేరుతో ప్రైవేట్ విద్య సంస్థలు బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని రాఘవులు ఆరోపించారు. ఉపాధి హామీ కార్మికులకు పని కల్పించడం కోసం పాత ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలను చేపట్టడం, ఆసుపత్రుల్లో క్లినింగ్ చేయించడం వంటి పనుల ద్వారా వారిని ఆదుకోవచ్చన్నారు. కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు కంటే ముందు కేంద్రం పై మీ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని రాఘవులు డిమాండ్ చేశారు.

You might also like