FbTelugu

రాధే చిత్రంపై నెటిజన్ల రచ్చ రచ్చ

ఈ మధ్యకాలంలో కొన్ని చిత్రాలపై విడుదలకు ముందే వివాదాలు చుట్టుముడుతున్నాయి. మరికొన్ని చిత్రాలు అయితే విడుదల అయిన రోజు నుంచే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంటున్నాయి.
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కథానాయకుడిగా, దిశా పటానీ కథానాయికగా నిర్మించిన చిత్రంపై నెటిజన్లు రచ్చ రచ్చ చేస్తున్నారు. సెకండ్ వేవ్ కారణంగా ఈ చిత్రాన్ని రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు ఒటిటి ఫ్లాట్ ఫామ్ లో రిలీజ్ చేశారు. ప్రస్తతం జి5 యాప్ లో ఈ చిత్రం విడుదల అయ్యింది.
ముంబయి క్రైమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. సల్మాన్ ఖాన్ మరోసారి తన సత్తాను నిరూపించుకున్నాడు. కాగా సోషల్ మీడియాలో రాధే చిత్రాన్ని నిషేధించాలని కోరుతూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. బాయ్ కాట్ రాధే అనే ట్యాగ్ తో ట్రెండ్ చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.