న్యూఢిల్లీ: దేశంలో మరో బుల్లెట్ ట్రైన్ మార్గం నిర్మాణం చేసేందుకు పనులు మొదలయ్యాయి. న్యూఢిల్లీ-వారణాసి మధ్య 800 కిలోమీటర్ల పొడవునా బుల్లెట్ ట్రైన్ నడపాలని కేంద్రం నిర్ణయించింది.
ఢిల్లీ నుంచి మధుర, ప్రయాగ్ రాజ్, వారణాసి, ఆగ్రా, కాన్పూర్, జేవర్ ఏయిర్ పోర్టు, లక్నో, రాయ్ బరేలీ లను కలుపుతూ వెళ్తుంది. సాధారణంగా ఈ మార్గంలో సర్వే నిర్వహించడానికి కనీసం ఏడాది సమయం తీసుకుంటుంది. సమయం చాలా తీసుకుంటున్నందున రాడార్ ద్వారా సర్వే నిర్వహించాలని నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రతినిధులు తెలిపారు. కేవలం 12 రోజుల వ్యవధిలో రాడార్ సర్వే పూర్తి కానున్నది. జీపీఎస్, ఫొటోలు, లేజర్ డేటా, రాడార్ అందించే సమాచారంతో సర్వే జరుగుతుంది.