FbTelugu

జాతి విద్వేష ట్వీట్లు… 3 వారాల జైలు శిక్ష

సింగపూర్: సోషల్ మీడియా వేదికగా జాతి విద్యేష పోస్టులు చేస్తే కొన్ని దేశాల్లో కఠినంగా శిక్షలు వేస్తుండగా చాలా దేశాల్లో పట్టించుకోవడం లేదు. అదేమంటే భావస్వేచ్ఛ అంటూ తప్పించుకుంటున్నారు.
సింగపూర్ దేశం నిబంధనలు ఉల్లంఘించేవారి పట్ల కఠినంగా ఉంటుంది. అక్కడి చట్టాలు కూడా అలా రూపొందించారు. తమ దేశంలో తప్పు చేసినట్లు తేలితే ఏ దేశం వారినైనా శిక్షిస్తుంది. భారతీయులను ఉద్దేశిస్తూ ఒక వ్యక్తి జాతి విద్వేష ట్వీట్లు చేశారు. ఆ వ్యక్తికి సింగపూర్ న్యాయస్థానం మూడువారాలు జైలు శిక్ష విధించింది. మళ్లీ తప్పు చేస్తే దేశ బహిష్కరణ చేస్తామని హెచ్చరించింది.

సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న మాలి దేశానికి చెందిన జైనల్ అబ్దిన్ షూపుల్ బహారీ అనే వ్యక్తి మార్చ, ఏప్రిల్ నెలల్లో పలు జాతి విద్వేష ట్వీట్లు చేశాడు. కరోనా వ్యాప్తి విషయమైన భారతీయులను ఆయన దూషించారు. ఈ ట్వీట్లపై కొందరు ఫిర్యాదు చేయడంతో సింగపూర్ పోలీసులు విచారించేందుకు బహారీని అదుపులోకి తీసుకున్నారు. ఆధారాలతో సహా కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో తన నేరాన్ని బహారీ అంగీకరించడంతో న్యాయస్థానం మూడు వారాలు జైలు శిక్ష విధించింది. మున్ముందు ఇలాంటి జాతివిద్వేష, దేశ వ్యతిరేక పనులకు దిగితే ఇక్కడి నుంచి బహిష్కరించి స్వదేశానికి పంపిస్తామని హెచ్చరిస్తూ తీర్పునిచ్చింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.