FbTelugu

‘తల్లిపై కూతురు హత్య’ కేసులో నిజనిజాలు: రాచకొండ సీపీ

Rachakonda-Seepi-exposed-by-the-realities-of-the-mothers-murder

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన తల్లిని హత్యచేసిన కూతురు కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ మీడియాకు తెలిపారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చేశామన్నారు. కమిషనర్ తెలిపిన వివరాల ప్రకారం.. కీర్తికి బాల్ రెడ్డి అనే వ్యక్తితో స్నేహం ఉంది. బాల్ రెడ్డి కారణంగా కీర్తి గర్భం దాల్చింది. అబార్షన్ చేయించుకునేందుకు శశికుమార్ అనే వ్యక్తిని ఆశ్రయించింది. ఈ విషయాన్ని ఆసరాగా తీసుకొని శశికుమార్ బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించాడు. అబార్షన్ విషయాన్ని ఇంట్లో చెబుతానంటూ కీర్తిని ట్రాప్ చేశాడు. అబార్షన్ తర్వాత కీర్తి, శశికుమార్ తో సన్నిహితంగా తిరిగింది. అదే సమయంలో శశికుమార్ తనతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను తీసుకున్నాడు. కీర్తి ఆస్తిపై కూడా కన్నేశాడు. పెళ్లి చేసుకోకుంటే ఆ ఫోటోలు బయటపెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు. ఈ విషయం తెలిసిన కీర్తి తల్లి రజిత, వీరి వివాహానికి అడ్డు చెప్పింది. దీంతో తల్లిని చంపేస్తే.. అడ్డు పోతుందని ఇద్దరూ భావించారు. అనుకున్న విధంగానే రజితను హత్య చేశారు. మృత దేహాన్ని రామన్నపేట రైల్వే ట్రాక్ పై పడేశారు. గతంలో కూడా నిద్రమాత్రలు వేసి చంపాలనే ప్రయత్నం కూడా చేశారు. కీర్తితో సన్నిహితంగా ఫొటోలతో శశికుమార్ బ్లాక్ మెయిల్ చేశాడు. శశికి భయపడి తల్లిని కీర్తి హత్య చేసింది. మృతదేహాన్ని తరలించే క్రమంలో కీర్తికి మద్యం తాగించాడు. మర్డర్ తర్వాత రూ. 10 లక్షలు తీసుకోవాలని భావించినట్టు తెలిపారు.

దృశ్యం సినిమా ను తలపించేలా ఈ మర్డర్ చేశారు. రజిత ను హత్య చేసిన తరువాత రజిత ఫోన్ నుండి ప్రియుడు బాల్ రెడ్డి కి స్వయంగా కీర్తి ఫోన్ చేసి తల్లి లాగా మాట్లాడింది

You might also like