FbTelugu

దుబాయ్ రాణి… బాడీ గార్డ్ తో ప్రేమాయణం!

దుబాయ్: దుబాయ్ పాలకుడు షేక్ మొహ్మద్ బిన్ రషీద్ మక్తుమ్ ఆరవ భార్య ప్రిన్సెస్ హయా బింట్ హుస్సేన్ గత రెండేళ్లుగా బ్రిటీష్ బాడీ గార్డు రస్సెల్ ఫ్లవర్స్ తో అక్రమ సంబంధం నెరపుతున్నట్లు మెయిల్ ఆన్ లైన్ పత్రిక కథనం ప్రచురించింది.
తన ప్రియుడికి రూ.1.2 మిలియన్ డాలర్ల నగదు, 12వేల డాలర్ల విలువైన రిస్ట్ వాచ్, అరుదైన షాట్ గన్ సమర్పించుకున్నది. ఈ వివరాలను రస్సెల్ భార్య వెల్లడించడం సంచలనంగా మారింది. హయా నా భర్తకు భారీ ఎత్తున నగదు, ఖరీదైన బహుమతులు కొనిచ్చి లొంగదీసుకున్నదని ఆరోపించింది. తన వద్దకు రాకుండా ఆమె దగ్గరే ఉంచుకున్నదని మండిపడింది. వీరిద్దరి బంధం తెలిసిన తరువాత తను ఎంత ఆందోళనకు గురయ్యానని, విడాకులకు సిద్ధమైనట్లు తెలిపింది.

జోర్డాన్ దేశ రాజు హుస్సేన్, క్వీన్ అలియా కుమార్తె అయిన హయా హుస్సేన్ ను దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ ఆరవ భార్యగా వివాహం చేసుకున్నాడు. రెండేళ్లుగా లండన్ లో నివాసం ఉంటున్న హయా తన భర్తపై విడాకులు, భరణం కోసం కేసు వేసింది. లండన్ హైకోర్టు లో విచారణ సందర్భంగా బాడీగార్డు రస్సెల్ తో హయా కు ఉన్న అక్రమ సంబంధం వెలుగు చూసింది. ప్రిన్సెస్ హయా తన అంగరక్షకులలో ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకున్నదని హైకోర్టు ఫైలులో పేర్కొన్నారు. వెస్ట్ లండన్ కెన్సింగ్టన్ లో హయా తన ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నది.

You might also like

Leave A Reply

Your email address will not be published.