FbTelugu

లాక్ డౌన్ ఉల్లంఘిస్తే క్వారంటైన్ కే

చిత్తూరు: కరోనా వైరస్ వ్యాప్తిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినంగానే అములు చేస్తున్నాయి. అయినప్పటికీ అక్కడక్కడ ఆకతాయిలు, మరికొందరు ఏపని లేకపోయినా బయటకు వస్తూనే ఉన్నారు.

ఈ క్రమంలో జిల్లాలోని శ్రీకాళహస్తిలో పోలీసులు లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్న వారికి డైరెక్ట్ గా క్వారంటైన్ ట్రీట్ మెంట్ ఇస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన యువకులను పోలీసులు అంబులెన్స్ లో క్వారంటైన్ కు తరలిస్తున్నారు. ఈ విధంగానైనా ప్రజలు బయటకు రాకుండా ఉంటారని ఆశిస్తున్నారు.

You might also like