హైదరాబాద్ : మజ్లిస్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 4,700 ఎకరాల హుస్సేన్ సాగర్ ఈ రోజు 700 ఎకరాలు కూడా లేదన్నారు. అక్రమ కట్టడాలు కూల్చేస్తామంటున్నారు, ఇంత వరకు కుల్చలేదు. హుస్సేన్‌సాగర్ కట్టపై ఉన్న పీవీ నర్సిహ్మా రావు, ఎన్టీఆర్ సమాధులను కూడా కూల్చాలి అని డిమాండ్ చేశారు.
గత ఎన్నికల్లో పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదన్నారు. ఈ ఎన్నికల్లో మాయ మాటలు చెబుతున్నారు. అసెంబ్లీలో మీ తోక ఎలా తొక్కాలో మాకు బాగా తెలుసు అని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు.