FbTelugu

ప్రియునిపై యువతి కత్తితోదాడి

కృష్ణా: గత కొంత కాలంగా సహజీవనం చేసిన తర్వాత ప్రియుడు పెళ్లికి ఒప్పుకోలేదని ఓ యువతి ఏకంగా కత్తితో దాడిచేసి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన జిల్లాలోని చల్లపల్లి మండలం వక్కలగడ్డలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీ పట్నానికి చెందిన ఓ యువతి, మరో యువకుడు గత కొంత కాలంగా ఒక రూమ్ అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు. కాగా నిన్న ఆ యువకుడు కత్తిగాట్లతో, యువతి కూడా అపస్మారకస్థితిలో పడి ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారిని ఆస్పత్రికి చేర్చి యువకున్ని విచారించగా సదరు యువతి మనం పెళ్లి చేసుకుందాం లేదంటే చచ్చిపోదాం అంటూ.. కత్తితో పొడించిందని తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like