FbTelugu

పూరీ జగన్నాథ రథయాత్ర మొదలు

భువనేశ్వర్: గత ఏడాది మాదిరే ఈ ఏడాది కూడా భక్తులు లేకుండానే పూరీ జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. పూరీ రాజు, వేద పండితులు, పురోహితులు, సిబ్బంది కలిసి రథయాత్రను నిర్వహించారు.

ఆషాడ శుక్ల విదియ అనగా నేడు వేద పండితులు మేళతాళాలతో ఉదయకాల పూజలు నిర్వహించి మనిమా (జగన్నాథా) అంటూ భక్తి పారవశ్యంతో నినాదాలు చేశారు. ఉత్సవ మూర్తులను కదలించడం ద్వారా రథయాత్ర ప్రారంభమైంది. ఉత్సవ మూర్తులు అయిన సుభద్ర, జగన్నాథ, బలభద్ర లను ఆనందబజార్, అరుణ స్థంభం మీదుగా ఊరేగించారు. ఆ తరువాత గుండిచా ఆలయానికి వెల్లేందుకు ఉత్సవమూర్తులు రథంపై సిద్ధమై ఉండగా ఇలపై నడిచే విష్ణువుగా విష్ణువుగా గౌరవాభిమానాలు అందుకు పూరీ రాజు అక్కడకి చేరుకున్నారు. ఆ తరువాత ఆయన పరమాత్ముడి ముందు సేవకుడిగా మారి బంగారు చీపురుతో రథాలను శుభ్రం చేశాడు. దేశ విదేశాలలోని భక్తులు ఆన్ లైన్ రథయాత్రను తిలకించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.