FbTelugu

పునర్నవి పెళ్లి డ్రామా!

బిగ్ బాస్ కంటెస్టెంట్ పునర్నవి భూపాలం పెళ్లి డ్రామాకు పుల్ స్టాఫ్ పెట్టింది. ఇన్ స్టాగ్రామ్ లో ఎంగేజ్ మెంట్ ఉంగరం అంటూ చేసిన పోస్టు వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసమేనని తేల్చింది.

బిగ్ బాస్ హౌస్ లో ఉండగా పునర్నవి, రాహుల్ సిప్లిగంజ్ పెళ్లి చేసుకుంటారనే వార్తలు గుప్పుమన్నాయి. తనతో ప్రేమలో లేదని రాహుల్ చెప్పినా ఎవరూ నమ్మలేదు. తాజాగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఎంగేజ్ మెంట్ ఉంగరం చూపించింది. త్వరలోనే పెళ్లి అవుతుందనే అర్థం వచ్చే విధంగా హడావుడి చేసింది. ఉద్భవ్ రఘునందన్ అనే నటుడిని పెళ్లి చేసుకుంటున్నదంటూ ఆమె చేసిన మరో పోస్టు వైరల్ అయ్యింది.

ఆ తరువాత తను, ఉద్భవ్ కలిసి ఉన్న ఫొటో పోస్టు చేసి… ఒకే కూడా చెప్పింది. ఇంకేముంది ఇక పెళ్లే మిగిలి ఉందనే విధంగా పోస్టులు చేశాడు. కొందరు అనుమానించిన విధంగానే పునర్నవి బురిడి కొట్టించింది. పెళ్లి కాదు ప్రమోషన్ కోసమే ఇదంతా చేశారని వెల్లడైంది. కమిట్ మెంటల్ అనే వెబ్ సిరీస్ కోసం ఈ పెళ్లి డ్రామాలు ఆడారనేది స్పష్టమైంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.