FbTelugu

లాక్ డౌన్ పై పంజాబ్ కీలక నిర్ణయం

లాక్ డౌన్ విషయంలో ఒడిషా బాటలోనే పంజాబ్ నడుస్తోంది. ఆ రాష్ట్రంలో లాక్ డౌన్ ను మే 1 వరకు కొనసాగించనున్నట్టు ప్రకటించింది.

అయితే ఇప్పటికే ఒడిశా ప్రభుత్వం లాక్ డౌన్ ను ఈ నెల 30 వరకు కొనసాగించాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. నిజానికి కేంద్రం విధించిన లాక్ డౌన్ ఈ నెల 14 తో ముగియనుంది. కానీ కరోనా వైరస్ వ్యాప్తి తగ్గకపోయేసరికి పంజాబ్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. రేపు ప్రధాని మోదీ లాక్ డౌన్ పొడగింపుపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

You might also like