FbTelugu

అమిత్ షాను కలవనున్న పంజాబ్ సీఎం

న్యూఢిల్లీ: నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ కలవనున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న రైతుల ఆందోళన నేపథ్యంలో.. కేంద్రంతో ఇవాళ రైతు సంఘాల ప్రతినిధులు మరోమారు చర్చలు జరపనున్నారు.

ఈ తరుణంలోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ ల మధ్య కీలక సమావేశం జరగనుంది. ఇప్పటివరకు రైతుసంఘాల ప్రతినిధులతో జరిగిన చర్చలు విఫలం కావడంతో నేటి భేటీ కీలకం కానుంది.

You might also like

Leave A Reply

Your email address will not be published.