FbTelugu

మాస్క్ లేకుంటే సమాధుల శిక్ష

జకర్తా: ఇండోనేషియా ప్రభుత్వం మాస్క్ ధరించకుండా బయట తిరుగుతున్న వారిపై వినూత్న శిక్షలు అమలుపరుస్తోంది. ప్రతి ఒక్కరు మాస్క్ ధరించి భౌతిక దూరం పాటించాలని చెబుతున్నా పౌరులు పట్టించుకోవడం లేదు.

మాస్క్ ధరించడం మూలంగా వైరస్ నుంచి రక్షణ పొందడంతో పాటు ఇతరులకు సోకే ప్రమాదం అవకాశం ఉండదు. జరిమానాలు విధిస్తున్నా జనం పెద్దగా స్పందించకపోవడంతో ఒకింత కఠినంగానే వ్యవహరిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్ లు లేకుండా తిరుగుతున్న వారిని గుర్తించి స్మశాన వాటికలకు పంపిస్తున్నారు. కరోనా తో చనిపోయిన వారి శవాలకు సమాధులు తవ్వడంతో పాటు పూడ్చి పెట్టే బాధ్యతను అప్పగిస్తున్నారు. ఒక వ్యక్తి సమాధి తవ్వితే మరొక వ్యక్తి శవపేటికలో శవాన్ని పూడ్చి పెట్టాల్సి ఉంటుంది.
ఈ శిక్ష తో పలువురు హడలిపోతున్నారు. శవాలను పూడ్చే బదులు మాస్క్ పెట్టుకోవడం మంచిదనే నిర్ణయానికి వచ్చారు.

You might also like