FbTelugu

ఆగస్టు 15న సీఎం ఆఫీసు కు పూజ

అమరావతి: విశాఖపట్నం కు తరలివెళ్లేందుకు సిద్దం అవ్వాలని ప్రధాన కార్యాలయాల అధిపతులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అధిపతులు ఇప్పటికే మానసికంగా సిద్దమయ్యారు.

ముఖ్య కార్యాలయాలు అన్ని విశాఖకు త్వరలో తరలివెళ్లనున్నాయి. సెప్టెంబరు నాటికి పూర్తిస్థాయిలో విశాఖ నుంచి పాలన జరగనున్నది. ఆగస్టు 15వ తేదీన విశాఖలో ముఖ్యమంత్రి కార్యాలయానికి పూజ చేయనున్నారు. తొలుత ముఖ్యమంత్రి కార్యాలయం తరలించనున్నారు. ఆగస్టు 15 తర్వాత నుంచి ముఖ్యమంత్రి విశాఖపట్నం నుంచే పాలనా వ్యవహారాలు కొనసాగించనున్నారు. దశలవారీగా ప్రధాన కార్యాలయాల తరలింపు చేయనున్నారు.

You might also like