FbTelugu

బహిరంగంగా ఉమ్మివేయడం నిషేధం

హైదరాబాద్: బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఊయటం నేరమని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. రోడ్లు, సంస్థలు, ఆఫీసులలో ఉమ్మివేయవద్దని ఉత్తర్వులు జారీ చేసింది.

కరోనా మహమ్మారి ప్రబలుతున్న ఈ సమయంలో వ్యక్తిగత, బహిరంగ ప్రదేశాల్లో పరిశుభ్రత తప్పనిసరి అని వైద్య, ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అనారోగ్యకరమైన అలవాట్లను మానుకోవాలని సూచించింది. వాటి వల్ల వైరస్, ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉందని పేర్కొంది

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం మూలంగా ఇలాంటి రోగాలు మరింత ప్రబలే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజారోగ్యం భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో పాన్ ,  ఉమ్మివేయడం, గుట్కా నమిలి ఉమ్మటం, పొగాకు ఉత్పత్తులు నమిలి ఉమ్మడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

You might also like