FbTelugu

10 వేల మందితో పులివెందులలో సభ: ఎంపీ రాజు

ఢిల్లీ: కరోనా మహమ్మారి తగ్గాక కడప జిల్లా పులివెందులకు వెళ్తానని వైసీపీ నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామ కృష్ణరాజు అన్నారు. తన నియోజకవర్గం నర్సాపురంలోనే కాదు.. పులివెందులలోనూ 10వేల మందితో బహిరంగ సభ పెడతానని ప్రకటించారు.

అమరావతి భూములపై పున:సమీక్ష కుదరదని ఏపీ హైకోర్టు చెప్పడాన్ని ఆయన స్వాగతించారు. రాజ్యాంగం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవం లేదని రఘురామకృష్ణరాజు విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చే హక్కు అసెంబ్లీకి లేదన్న కనీస అవగాహన లేదన్నారు. న్యాయవ్యవస్థలను గౌరవించడం నేర్చుకోవాలని ఆయన హితవు పలికారు.

ఓవైపు న్యాయవ్యవస్థపై దాడిచేస్తూనే గాంధీ విగ్రహం వద్ద రచ్చ చేస్తున్నారని రఘురామకృష్ణరాజు దుయ్యబట్టారు. గత ప్రభుత్వ నిర్ణయాలపై మంత్రివర్గ ఉపసంఘం వేయడం హాస్యాస్పదమన్న ఆయన… సిట్ ఏర్పాటు చేస్తే కోర్టు స్టే ఇచ్చిందని చెప్పారు. వైసీపీ  ప్రభుత్వం కూడా భవిష్యత్తులో మాజీ ప్రభుత్వం అవుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఆయన హెచ్చరించారు. అమరావతి భూములపై పున:సమీక్ష కుదరదని హైకోర్టు చెప్పడం శుభపరిణామం.

ఆవ భూముల కుంభకోణంపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. అమరావతి భూములపై సీబీఐ విచారణ కోరిన వాళ్లు… ప్రత్యేక హోదా, రైల్వే జోన్ పై ఎందుకు ఫ్ల కార్డులు ప్రదర్శించలేదని  రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.