FbTelugu

కిమ్ ఆరోగ్యంపై ప్రజల ఆందోళన?

ప్యాంగ్యాంగ్: తమ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ అనారోగ్యం పై ఉత్తరకొరియా ప్రజలు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు. ఆయన ఆరోగ్యంపై పుకార్లు షికార్లు చేస్తున్న సమయంలో సన్నబడ్డారనే వీడియోలు రావడంతో మరింతగా చర్చించుకుంటున్నారు.
కిమ్ జాంగ్ ఉన్ ఇటీవల మీడియా ముందుకు రాలేదు. చాలా కాలం తరువాత మీడియా ముందుకు వచ్చిన ఆయన ను చూసి పార్టీ నాయకులు, అధికారులు ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంతలా సన్నబడిపోయారంటూ ఆసక్తిగా చూశారు.

అయితే కిమ్ ఇలా కన్పించడంపై ప్రజలు మాత్రం తెగ బాధపడుతున్నారు. ఎప్పుడూ బొద్దుగా, లడ్డూ మాదిరి నిండుగా కన్పించే ఆయన సన్నగా ఉండడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అనారోగ్యానికి గురికావడంతోనే సన్నబడ్డారనే వార్త కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొడుతున్నది. దీనికి తోడు సన్నబడ్డ వీడియో ఒకటి బయటకు రావడంతో వైరల్ అయ్యాయి. నాలుగు నెలల్లోనే ఎంత మార్పు అంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు. డైట్ పాటిస్తున్నారని కొందరు, 140 కేజీల నుంచి 120 కేజీలకు తగ్గారని ఇలా పలు రకాలుగా నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.