FbTelugu

ఆస్తి పన్ను పెంపుపై ప్రజా బ్యాలెట్

గుంటూరు: నగరంలో ఆస్తి విలువపై పన్ను విధానాన్ని వ్యతిరేకిస్తూ ప్రజా బ్యాలెట్ నిర్వహించారు. ఆస్తి పన్ను పెంపు పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆస్తి విలువపై పన్ను విధానాన్ని వ్యతిరేకించారు.

గుంటూరు నగరంలోని కొరిటపాడు వాకింగ్ ట్రాక్ పార్క్ లో వచ్చిన వాకర్లకు బ్యాలెట్ పత్రాలను అందచేశారు. వాటిని పరిశీంచిన ప్రజలు తమ అభిప్రాయం ఏమిటో తెలియచేయాలని కోరారు. బ్యాలెట్ పై నూతన విధానాన్ని సమర్థిస్తారా? వ్యతిరేకిస్తారా?? అనే అంశాన్ని ముద్రించారు. అధికశాతం మంది నూతన పన్ను విధానాన్ని వ్యతిరేకిస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అలాగే ఆస్తి పన్ను పెంపుపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా జరిగే నష్టంపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.