FbTelugu

ఆర్టీసీ బస్సులో సైకో వీరంగం

కృష్ణా: ఆర్టీసీ బస్సులో ఓ సైకో గాజు సీసాతో వీరంగం సృష్టించిన ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. రాజమండ్రి నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సులో ఓ సైకో గాజు సీసాను పగులకొట్టి తోటి ప్రయాణికులపై దాడిచేస్తూ..

ఒక్కసారిగా హల్ చల్ చేశాడు. ఈ దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైనాయి. అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం బస్సును డ్రైవర్ గన్నవరం పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లగా ఈ కేసు తమ పరిధిలోది కాదని ఆత్కూర్ పీఎస్ కు తిప్పి పంపారు.

You might also like